NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 2, 2020

DRDO Recruitment Hyderabad 2020

  NewNotifications       Oct 2, 2020

DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు-ఖాళీల వివరాలు ఇవే

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO హైదరాబాద్‌లోని సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

DRDO Hyderabad

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు. హైదరాబాద్ డీఆర్‌డీఓలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో ఈ ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలవ్యవధి ఉన్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 6 చివరి తేదీ. అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయకపోతే దరఖాస్తుల్ని డీఆర్‌డీఓ తిరస్కరిస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్‌ https://www.drdo.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

DRDO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 90

ఐటీఐ ఇన్ ఫిట్టర్- 25

ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్- 20ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్- 15

ఐటీఐ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 10

ఐటీఐ ఇన్ టర్నర్- 10

ఐటీఐ ఇన్ మెషినిస్ట్- 5

ఐటీఐ ఇన్ వెల్డర్- 5

DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 26

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 6

విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో రెగ్యులర్ ఐటీఐ పాస్ అయినవారు అప్లై చేయాలి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ పాసైనవారు మాత్రమే అర్హులు.

స్టైపెండ్- రూ.7,700 నుంచి రూ.8050.

ఎంపిక విధానం- అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ.

DRDO Recruitment 2020: అప్లై చేయండి ఇలా

అభ్యర్థులు ముందుగా కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్-MSDE వెబ్‌సైట్ www.apprenticeshipindia.org ఓపెన్ చేయాలి.

Register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

విద్యార్హతల సర్టిఫికెట్స్, ఐడీ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాత Research Centre Imarat సంస్థలో అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading DRDO Recruitment Hyderabad 2020

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...